03-03-2025 01:41:35 AM
కామారెడ్డి, మార్చి ౨ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో స్థానిక కురుమ సంఘ భవనం వద్ద ఆదివారం కురుమ చైతన్య సమితి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు మామిడి సంజీవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
గొల్లపల్లి గ్రామ అధ్యక్షులుగా కందూరి నరేష్ కురుమ, ఉపాధ్యక్షులు గా జీర్ల మహేష్ కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ కందూరి సుమన్ కురుమ, ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్లేష్, కోశాధికారి - కందూరి మహేష్ , ప్రచార కార్యదర్శి జీర్ల నాగరాజు , కార్యదర్శి కందూరి సుధాకర్ , సలహాదారులు - కందూరి లింగం , కందూరి నరసింహులు , కార్యవర్గ సభ్యులు, జేపీ మహేష్ , జీర్ల పాల బీరయ్య , రెడ్డి బీరయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి వ్యవస్థాపక సభ్యులు చెలిమేటి గంగాధర్,జిల్లా నాయకులు ఎంకంపల్లి దేవయ్య , మండల నాయకులు పర్స మహేష్, గొల్లపల్లి కురుమ కుల సభ్యులు పాల్గొన్నారు.