calender_icon.png 24 February, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్మపల్లి పంచాయతీ ఏర్పాటు నిలిపివేత

15-02-2025 01:48:55 AM

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం రామచంద్రాపురం నుంచి కుర్మపల్లిని విభజించి కొత్త పంచాయతీ ఏర్పాటును నిలిపివేస్తూ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తగిన కారణాలు లేకుండా పంచాయతీని విడదీసి మరో పంచాయతీని ఏర్పా టు చేయడం సరికాదని, గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సహేతుక కారణాలను వివరించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రామచంద్రాపురం నుంచి కుర్మపల్లిని విభ జించి కొత్త పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గతేడాది జులై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రామచంద్రాపురానికి చెందిన ఎం రాజుతో పాటు మరొకరు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. దీనిపై జస్టిస్ టీ మాధవీదేవి విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొత్త పంచాయతీల ఏర్పాటుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరించలేదన్నారు. పీపీ వాదనలు వినిపి స్తూ పంచాయతీ  చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం విలీనం, విభజన, సరిహద్దుల మార్పు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.

సహేతుక కారణాలు లేనందువల్ల కుర్మపల్లి పంచాయతీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన గెజిట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తున్నామని హైకోర్టు చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 13కు వాయిదా వేశారు.