calender_icon.png 30 October, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీకి ‘కూర్మనాయకి’ వెల్‌కమ్

30-06-2024 12:05:00 AM

హీరోగా గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన శివాజీ ఈమధ్య ‘#90s’ పేరుతో వచ్చిన వెబ్ సిరీస్‌లో తనదైన సహజ నటనతో మధ్యతరగతి కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా మరోమారు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉంటున్న ఆయన సినిమాల పరంగా వెండితెరపై కనిపించి చాలా రోజులే అయిందని చెప్పాలి. అయితే, ఇటీవల ప్రారంభమైన సోషియో ఫాంటసీ చిత్రం ‘కూర్మ నాయకి’లో శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. జూన్ 30వ తేదీ శివాజీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం శనివారం ఓ వీడియోను విడుదల చేసింది.

ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్‌లో శివాజీ భాగం కానున్న నేపథ్యంలో ‘అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే శివన్నా.. వెల్‌కమ్ టు కూర్మనాయకి’ అంటూ ఈ వీడియో ద్వారా ఆహ్వానం పలికారు. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కె.హర్షవర్ధన్ కడియాల తెరకెక్కిస్తున్నారు. కాలభైరవ ప్రొడక్షన్స్, ఎంఎం క్రియేషన్స్ బ్యానర్లపై కె.విజితరావు నిర్మిస్తుండగా.. సాయికుమార్, అతిరా రాజ్, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నారని, అది ఎవరనేది త్వరలో వెల్లడిం చనున్నామని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ రామ్ కాగా, శేఖర్ చంద్ర సంగీత సారథ్యం వహిస్తున్నారు.