01-03-2025 08:31:34 PM
హాజరైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..
కోదాడ (విజయక్రాంతి): కోదాడ అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విద్యావేత్త కుందూరు జయపాల్ రెడ్డి, శైలజ పుణ్య దంపతుల షష్టిపూర్తి వేడుకలు కోదాడ పట్టణంలోని వేమూరి సుధాకర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలకు ముఖ్యఅతిథిగా జనగామ ఎమ్మెల్యే అనురాగ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై జయపాల్ రెడ్డి శైలజ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జైపాల్ రెడ్డి దంపతులు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జైపాల్ రెడ్డి శైలజ దంపతుల అల్లుళ్ళు సీతారామిరెడ్డి సుమన్ రెడ్డి మనుమలు అశ్విత్ రెడ్డి ఆహన్ రెడ్డి మనుమరాలు హంసిక రెడ్డి బంధువులు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు