calender_icon.png 11 January, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుందనపు బొమ్మ!

20-08-2024 12:30:00 AM

సారా టెండూల్కర్.. చూడచక్కని కళ్లు. పాలరాతి బొమ్మలా ఉండే ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సారా అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ సెల్ప్ పోర్ట్రెయిట్ ప్రకటనల్లో కనిపించి మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడూ గ్లామర్ రంగంలో ఎంట్రీ ఇస్తూ.. ప్రఖ్యాత భారతీయ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్ లానీజ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

సారా గ్లామర్ పరంగా సింపుల్ మేకప్‌తో క్యూట్ లుక్‌తో కనిపిస్తుంది. మస్కరాతో నిండిన కనురెప్పలతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. పైగా అందమంతా గుది గుచ్చినట్లుగా ఉంటుంది. అందుకు తగ్గట్టు ఆమె ధరించే డిజైన్‌వేర్‌లు ఆమె అందాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి. ట్రెండీ లుక్‌తో.. సంప్రదాయబద్దంగా కనిపించే డిజైనర్‌వేర్‌లు ఓ సారి మీరు ట్రై చేసి చూడండి!