29-03-2025 02:19:34 AM
ఏప్రిల్ 7 వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు
చెన్నై, మార్చి 28: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై పేరడీ పాటను ఆలపించిన ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రాకు ముందస్తు బెయిల్ లభించింది. ఆయనకు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 7 వరకు కమ్రాను అరెస్ట్ చేయొద్దని కోర్టు వెల్లడించింది. కమ్రా ముంబైలో కామెడీ షో చేసినప్పటికీ.. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. షిండేపై వ్యాఖ్యల అనంతరం కమ్రాకు చెందిన స్టూడియోను పలువురు శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆయన మీద మహారాష్ట్రలో అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో ఇప్పటికే పోలీసులు తమ ఎదుట హాజరుకావాలని నోటీసులిచ్చారు. ఈ నోటీసుల నేపథ్యంలోనే కమ్రా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.