- అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్30 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం కాగజ్‌నగర్ మండలం లోని శ్రీరాంనగర్ 12వ వార్డులో పల్లెదవాఖాన, ఈస్‌గాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏఎంసీ కాపువాడలో మిషన్ భగీరథ అర్బన్‌వాటర్ సప్లు పథకం, రెబ్బెన మండలం కేంద్రంతో పాటు నవెగాం, ఖైర్‌గాంలో పల్లెదవాఖానలు, గంతాపూర్‌లో కస్తూర్భాగాంధీ విద్యాలయం, ఆసిఫాబాద్‌లో డైట్ కళాశాల భవనం, మహాత్మాజ్యోతిరావుపూలే బాలుర గురుకుల ప్రైవేటు భవనం, సిర్పూర్(యు), లింగాపూర్ మండల కేంద్రాల్లో కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాలను కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాన్నన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా సంఘాల అధ్వర్యంలో నిర్వహిస్తున్న సినిమా థియేటర్‌ను సందర్శించారు. మంత్రి వెంట జెడ్పీటీసీలు వేముర్ల అజయకుమార్, అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, నియోజవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు గాదవెణి మల్లేష్, మునీర్, నాయకులు చరణ్, అసద్, ప్రకాష్‌రావు, సుదర్శన్‌గౌడ్, సలీం, రఫు తదితరులు ఉన్నారు.
మంత్రి పర్యటనలో ప్రొటోకాల్ రగడ
మంత్రి సీతక్క పర్యటనలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. రెబ్బెన మండలంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాలకు పార్టీ జెండాలు కట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిర్పూర్(యు)లో ప్రొటోకాల్ పాటించడం లేదని జెడ్పీటీసీలు కోవ ఆరుణ, దుర్పాద బాయి, రక్కబాయి, జిల్లా మాజీ గ్రంథా లయ చైర్మన్ కనక యాదవరావు అధ్వర్యం లో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలి పారు. ఎమ్మెల్యే కోవలక్ష్మిపై మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు వివక్ష చూపడం తగదన్నారు.