- మూడు జిల్లాలు అతలాకుతలం
- ఏజెన్సీలో విరిగిన కొండచరియలు
- 13 మంది మృత్యువాత.. మరో 55 మంది గల్లంతు
సిమ్లా, ఆగస్టు 5: హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తోంది. నాలు గు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూడు జిల్లాలు నీటమునిగాయి. ఏజెన్సీలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల ధాటికి కొండచరియలు విరిగిపడి సుమారు 60 ఇండ్లు నేలమట్టమయ్యాయి. 42 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
శనివారం నాటికి వరదల్లో కొట్టుకు పోయి, కూలిన శిథిలాల కిందపడి ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. వరదల్లో మరో 55 మంది గల్లంతయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల కారణంగా రూ.700 కోట్ల నష్టం వాటిల్లింది.