వరదలో చిక్కుకొని 22 మందికి పైగా మృతి, 30 మంది గల్లంతు
హిమాచల్ ప్రదేశ్, ఆగస్టు 8: హిమాచల్ ప్రదేశ్‌లో కుంభ వృష్టి కారణంగా ఏర్పడిన వరదల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. శీఖండ్‌లోని సమేజ్, బాఘీ వంతెన సమీపంలో బలమైన నీటి ప్రవాహం ఉండటంతో 45మందికి పైగా కొట్టుకొని పోయారు. అందులో 22మంది చనిపోగా.. దాదాపు 30 మందికి పైగా గల్లంతయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పల్గొంటున్నాయి. మండి జిల్లాలోని చంఢీగడ్‌మనాలి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడగా రెండు భారీ వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. పలుచోట్ల వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడి దాదాపు 100కు పైగా రోడ్లు మూసుకుపోయాయి.