calender_icon.png 10 January, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షీరసాగర మథనం వద్ద కుంభమేళా!

05-01-2025 01:51:02 AM

* పురాణాల ప్రకారం అక్కడే మూలాలు

* కుంభమేళా, మహాకుంభ మేళాకు స్పష్టమైన తేడా

* ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగగా గుర్తింపు

న్యూఢిల్లీ, జనవరి 4: మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ముస్తాబవుతోంది. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగే ఈ ఆధ్యాత్మిక పండగలో దాదాపు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన సుమారు 40కోట్ల మంది ప్రజలు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

కుంభమేళాలో పాల్గొన్న ప్రజలు ప్రయాగ్‌రాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. కాగా భారతదేశంలో కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కుంభమేళా జరగడానికి ఓ పెద్ద చరిత్ర ఉంది. కుంభమేళాకు మూలాలు క్షీరసాగర మథనం వద్ద పడ్డాయని పురాణాల ప్రకారం అర్థమవుతుంది. 

పురాణాలు ఏం చెబుతున్నాయంటే

పురణాల్లో క్షీరసాగర మథనం గురించి పెద్ద చరిత్ర ఉంది. వాటిల్లోని వివరాల దేవతలు, రాక్షసులు చేరో వైపు నుంచి పాల సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో అక్షయపాత్ర, కల్పతరువుతోపాటు విషం, అమృ తాలు కూడా బయటికొచ్చాయి. అలా క్షీరసాగర మథనంలో బయటకు వచ్చిన అమృ తంలోని నాలుగు చుక్కలు భారతదేశంలోని వేరు వేరు ప్రదేశాల్లో పడ్డాయట. అప్పుడు అమృతం చుక్కులు పడిన ప్రాంతాల్లోనే నిర్ధి ష్ట సమయాల్లో కుంభమేళాలు జరుగుతున్నాయి.

పురణాల్లో వివరాల ప్రకారం భార తదేశంలోని హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల్లో క్షీరసాగర మథ నం సమయంలో అమృతం చుక్కలు పడ్డట్టు ప్రతీతి. భారతీయ గ్రహశాస్త్ర లెక్కల ప్రకారం హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్ ప్రాంతాల్లో నాలుగేళ్లకు ఒకసారి కుంభమేళ జరుగుతుండగా ప్రయాగ్‌రాజ్‌లో 12ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. 

కుంభమేళాకు, మహాకుంభమేళాకు తేడా

కుంభమేళా అఏది అర్థకుంభమేళ, పూర్ణకుంభమేళా, మహాకుంభమేళా అనే మూడు విధాలుగా జరుగుతంది. ఈ మూడు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేళాను ఆర్ధ కుంభమేళా అంటారు. ఇది యూపీలోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌లలో మాత్రమే జరుగుతుంది.

ఇక పూర్ణ కుంభమేళా విషయానికి వస్తే ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ప్రయాగ్‌రోజ్‌లోని త్రివేణీ సంగమ తీరంలో జరుగుతుంది. మహాకుంభమేళాకు ఒక విశిష్టత ఉంది. 12 పూర్ణకుంభమేళాల (144ఏళ్ల తర్వాత) తర్వాత నిర్వహించే కుంభమేళాను మహాకుంభమేళా అంటారు. 

కుంభ్ అంటే..

కుంభ్ అంటే కుండ అనే అర్థం వస్తుంది. ఒక రకంగా అమృతపు కుండగా దీన్ని భావి ంచొచ్చు. భారత గ్రహశాస్త్ర లెక్కల ప్రకారం పూర్ణకుంభమేళా లేదా మహాకుంభమేళా స మయంలో బృహస్పతి, సూర్య, చంద్రులు ఒ క ప్రత్యేకమైన అమరికలోకి వస్తారు. ఆ సమయంలో కుంభమేళా ప్రాంతాల్లోని నదీ జ లాల్లో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా పాప విముక్తి లభిస్తుందని, మోక్షం పొందొచ్చని భక్తులు విశ్వసిస్తుంటారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ

కుంభమేళాను ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతమైన ఆధ్యాత్మిక పండుగగా యునెస్కో గుర్తించింది. దీనికి కారణం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుంభమేళాలో ప్రపంచంలోని అనేక దేశాలకు చేందిన కోట్లాది మంది పాల్గొంటారు. ప్రపంచంలో జరిగే ఏ ఉత్సవంలోనైనా ఇంత పెద్ద మొత్తంలో భక్తులు పాల్గొనరు. అందువల్లే యునెస్కో కుంభమేళాను ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక పండుగగా గుర్తించింది.