calender_icon.png 18 April, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని తహసీల్దార్ గా కుమారస్వామి

15-04-2025 08:46:33 PM

మంథని (విజయక్రాంతి): మంథని తహసీల్దార్ గా రామగుండం తహసీల్దార్ కుమారస్వామిని బదిలీ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తహసీల్దార్ గా విధులు నిర్వహించిన రాజయ్యను పెద్దపల్లికి బదిలీ చేయగా పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ ను మంథనికి కలెక్టర్ బదిలీ చేశారు. రాజ్ కుమార్ విధుల్లో చేరకపోవడంతో మంథని నయాప్ తహసీల్దార్ గిరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో మంథనిలో తాహసీల్దార్ లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్, తాహసిల్దార్ కుమారస్వామిని నియమించడంతో ఇక రైతుల సమస్యలు తీరనున్నాయి.