calender_icon.png 9 January, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగకు ఊరెళ్తున్నారా... ఇళ్ళు జాగ్రత్త

09-01-2025 11:00:09 AM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): సంక్రాంతి పండగ సెలవులను పురస్కరించుకొని పల్లెటూరులకు వెళ్లే ఆయాకాలనీ, అపార్ట్మెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూకట్ పల్లి ఏసిపి శ్రీనివాసరావు(Kukatpally ACP Srinivasa Rao) సూచించారు. గతంలో పండగ సమయంలో జరిగిన దొంగతనాలను పరిగణలోకి తీసుకొని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. సొంత గ్రామాలకు వెళ్లే వారు ఇళ్లల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు తో పాటు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్ లో లేదా బంధువుల ఇళ్లల్లో లేదా తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు.

అదేవిధంగా ఇంటిముందు ద్విచక్ర వాహనాలు, కార్ లను బయట పార్కింగ్ చేయకుండా ఇంటి ఆవరణంలో పార్కింగ్ చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఉన్నవారు ఎప్పటికప్పుడు వారి మొబైల్ లో ఫోన్లో ఇంటిపై ఒక కన్నేసి ఉంచాలన్నారు. పండగలకు వెళ్తున్న సమయంలో విలువైన వస్తువులను తీసుకెళ్లే క్రమంలో ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ గమ్యానికి చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్సులు ఎక్కే దిగే సమయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఏదైనా అనుమానం వస్తే సంబంధిత పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు. తమ బాధ్యతగా దొంగతనాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.