calender_icon.png 5 December, 2024 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌన్సిలర్ పదవికి కుడుముల రాజీనామా

05-12-2024 12:57:02 AM

కామారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా గతంలో కొనసాగిన కుడుముల సత్యనారాయణ తన కౌన్సిలర్ పదవికి  బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి నుంచి తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగానని, అనివార్య కారణాలతో బీఆర్‌ఎస్ పార్టీలో చేరానని చెప్పారు. ఎమ్మెల్యే మధన్‌మోహన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడనై బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు సహకరించిన పారిశుద్ధ్య కార్మికులకు, ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.