calender_icon.png 12 January, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా కుడారై ఉత్సవం

12-01-2025 12:39:16 AM

కోరుట్ల, జనవరి 11 (విజయ క్రాంతి): పవిత్ర ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని అతి పురాతన శ్రీవేంకటేశ్వర దేవాలయంలో శనివారం కూడారై ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయ తిరుప్పావైలో భాగంగా సూర్యోదయానికి ముందే మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకార్చనలు వేదోక్తంగా నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది లక్ష్మీనర్సింహాచారి ’గోదాదేవి పాశురాన్ని’ పఠించి, భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా గోదాదేవి,  రంగనాథస్వామి విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కుడారై వేడుకలో భాగంగా 108 గంగాళం(కుడారై) పాత్రల్లో పాయసాన్ని ఉంచి స్వామివారికి నివేదించారు. ఈ ఉత్సవంలో అర్చకులు శ్రీనివాసాచారి, ఆలయ ఈవో విక్రం, నరసయ్య, భక్తులు పాల్గొన్నారు.