28-02-2025 12:00:00 AM
ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రం 20 జూన్ 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్యారెక్టర్ బేస్డ్ నెరేటివ్స్‌తో ఈ సినిమాను శేఖర్ కమ్ముల అద్భుతంగా తీర్చిదిద్దారంటూ టాక్ నడుస్తోంది.
చాలా గ్యాప్ తర్వాత వస్తున్న శేఖర్ కమ్ముల చిత్రం కావడంతో దీనికోసం అత్యంత ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను నాగార్జున, ధనుష్‌లను ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అద్భుతం గా మేకర్స్ ప్రజెంట్ చేశారు. జిమ్ సర్భ్ బ్యాక్ డ్రాప్‌లో నిలబడి ఉండడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్‌తోనే అంచనాలను పెంచింది. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శేఖర్ కమ్ముల, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ,మలయాళ భాషలలో విడుదల కానుంది.