05-04-2025 02:02:22 AM
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ నేత కేటీ ఆర్ పగటికలలు కంటున్నారని ఫిష రీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సా యికుమార్ ఎద్దేవా చేశారు. మూడే ళ్లు కాదు కదా.. మరో 13 ఏండ్లు అయిన అధికారంలోకి రాదని ధ్వజమెత్తారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన అరాచకం అంతాఇంతా కాదని, రాసుకుంటే రామకోటి.. చెప్పుకుంటూపోతే రా మాయణం అని మండిపడ్డారు.
రా ష్ట్ర ఖజానాను దోచుకొని దాచుకొని ఫాంహౌస్, ప్యాలెస్‌లు కట్టుకున్నారని, కేటీఆర్ అబద్ధాలను పదేపదే చెప్పి నిజాలుగా నమ్మించే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారని విమ ర్శించారు. బీఆర్‌ఎస్‌ను భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని సూచించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ఒకే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాయని ఆరోపించారు. పదేళ్లు అధికా రంలో ఉండి విద్యార్థులు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు వారిని మరోసారి పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.