14-04-2025 12:00:00 AM
మేడ్చల్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు మేడ్చల్ నియోజకవర్గం పర్యటన రద్దయింది. బి ఆర్ ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం సోమవారం అలియాబాద్ లోని సీఎంఆర్ గార్డెన లో జరగాల్సి ఉంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా సభను వాయిదా వేశారు. సమావేశం మళ్లీ ఎప్పుడు జరిగేది తర్వాత ప్రకటిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపారు.