09-04-2025 01:33:56 AM
ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య అపవిత్ర పొత్తులు కొనసా గుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాన్‌జబ్బలు (ప్రాణమిత్రు లు)గా మారారని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ధరణి భూముల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్, ఫాంహౌ జ్ డ్రగ్స్ కేసు వంటి వాటిలో కేసీఆర్ కుటుం బ సభ్యుల ప్రమేయం ఉందని సీఎం రేవంత్‌రెడ్డే మొదట్లో మాట్లాడారని తెలిపారు.
కేటీఆర్‌తో కు మ్మక్కున తర్వాత ఆ కేసులను నీ రుగార్చేందుకు ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటన్నారు. అందుకు ప్రతిఫలంగా రేవం త్‌రెడ్డి ప్రభుత్వంతో కలిసి భూముల దోపిడీకి, అవినీతికి కేటీఆర్ సహకరిస్తున్నట్లు ఆరోపించారు. హెచ్‌సీయూ భూములను తెగనమ్మడానికి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే.. కేటీఆర్‌పైకి గొడవ చేసినట్లు నటిస్తున్నా లోలోపల పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపించారు.
పార్లమెంటులో వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై జరిగిన ఓ టింగ్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎంపీలు కేం ద్రానికి వ్యతిరేకంగా ఓటేసేలా నిర్ణయం తీసుకుంది కూడా వారిద్దరేనని ఆరోపించారు. హైదరాబాద్ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీచేయకుండా మజ్లిస్‌ను గెలిపించేందుకు సహక రిస్తున్నది రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌లేనని బండి విమర్శించారు.