calender_icon.png 8 January, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ పాస్‌పోర్టును సీజ్ చేయాలి

08-01-2025 01:36:51 AM

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాం తి): ఫార్ములా ఈఞూ కేసు విచారణ నుం చి తప్పించుకునేందుకు కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. విదేశాలకు పారిపోకుండా కేటీఆర్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని ఆయన కోరారు. మంగళవారం గాంధీభవన్‌లో వెంకట్ మీడియాతో మాట్లాడుతూ..

ఏసీబీ, ఈడీ విచారణకు వెళ్లకుండా, సహకరించకుండా కేటీఆర్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శిం చారు. సుప్రీంకోర్టు ను ఆశ్రయించే ప్రయత్నం చేయ డం సిగ్గు చేటన్నా రు. తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు ఇబ్బంది ఎందుకని నిలదీశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుం డా కేసీఆర్, హరీశ్‌రావు, కవితల కోసం పని చేస్తున్నారని విమర్శించారు.