calender_icon.png 15 November, 2024 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అల్లుడిపై కేటీఆర్ అసత్య ఆరోపణలు

14-11-2024 02:16:29 AM

విప్ రామచంద్రునాయక్ 

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ప్రజాస్యామ్యయుత పాలన సాగుతుంటే.. బీఆర్‌ఎస్ పార్టీ ఓర్చుకోవడం లేదని ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ విమర్శించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి బీఆర్‌ఎస్ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.

బుధవారం ఆయన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కొడంగల్ వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఫార్మా విలేజ్ కోసం రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తుంటే బీఆర్‌ఎస్ కార్యకర్తలు రైతుల వేషాల్లో వచ్చి కలెక్టర్‌పైన దాడి చేశారని ఆరోపించారు.

సీఎం రేవంత్ అల్లుడిపై కేటీఆర్ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కొడంగల్‌లో మొత్తం 600 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్ రాబోతుందని, 200 ఎకరాలు గ్రీన్‌ఏరియానే ఉంటుందని తెలిపారు.