రాజకీయ దాడులకు సినీ పరిశ్రమను వాడుకోవద్దు: ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చేసిన వ్యాఖ్యలపై ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) చైర్మన్ దిల్ రాజు స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన అన్నారు.
సీఎంతో చిత్ర పరిశ్రమ సమావేశం చాటుమాటుగా జరిగిన వ్యవహారం కాదన్నారు. ‘గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధా కరం. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందే.
తెలు గు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి పయనంలో తెలు గు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి, రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎంగారు కాంక్షించారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎంగారి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. కాబట్టి అనవ సర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకో వద్దని అందరినీ కోరుతున్నాం.
లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తు న్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ వ్యవహారంపై ఇటీవల మరోమారు స్పందించిన కేటీఆర్.. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందు కే సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్ల గురించి వ్యాఖ్యలు చేశారన్నారు. అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ పాకులాడుతున్నారంటూ విమర్శించారు. సినిమా వాళ్లతో సెటిల్ చేసు కుని ఇప్పుడు రేవంత్ సైలెంట్ అయ్యారని కేటీఆర్ ఆరోపించారు.