తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు
విలేకరుల సమావేశంలో స్పష్టంచేసిన ఆస్పత్రి యాజమాన్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13(విజయక్రాంతి): మెడికవర్ ఆస్పత్రిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆ ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. హైటెక్ సిటీలో ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మెడికవర్ ఆస్పత్రిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెడికవర్ ఆస్పత్రుల చైర్మన్, ఎండీ డాక్టర్ అనిల్‌కృష్ణ మాట్లాడుతూ మెడికవర్ ఆస్పత్రికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలతో పాటు జర్మనీ, స్వీడన్, పోలండ్, టర్కీ, బెలారస్, బల్గేరియా, జార్జియా, హంగేరీ, రొమేనియా, సెర్బియా, మోల్డోవా, ఉక్రెయిన్ దేశాల్లో ఆస్పత్రులున్నట్లు చెప్పారు. తమ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, కేంద్ర మంత్రి గడ్కారీ, రామ్మోహన్‌నాయుడు, శరద్‌పవార్, దేవేం ద్ర ఫడ్నవీస్, చినజీయర్ స్వామి లాం టి వారితో ఆస్పత్రులను ప్రారంభించినట్లు చెప్పారు.
అలాగే తమ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అన్నం శరత్‌రెడ్డి మాక్స్‌బీన్ ఫార్మలో డైరెక్టర్ కాదని స్పష్టం చేశారు. సమావేశంలో మెడికవర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అన్నం శరత్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.