calender_icon.png 20 January, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ x బండి

12-07-2024 02:05:38 AM

చేనేత ఆత్మహత్యలను నివారించాలి

సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలి 

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ బహిరంగ లేఖ

నేతన్నలకు మీరేం చేశారు?.. సిరిసిల్లలో 15 ఏళ్లుగా ఉంటున్నారు

మీ హయాం నుంచి ఆకలి చావులు.. కేటీఆర్ లేఖకు బండి కౌంటర్

చేనేత ఆత్మహత్యలను నివారించాలి

  1. సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలి 
  2. బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని కోరుతూ కేంద్రమంత్రి బండి సంజ య్‌కుమార్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు బహిరంగ లేఖ రాశా రు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపిందని, అనేక సార్లు పవర్‌లూమ్ క్లస్టర్ కోసం పదిసార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 

ఈసారి సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తెప్పించాలని, కేంద్రమంత్రిగా మీకు వచ్చిన అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఈ ప్రాంత ఎం పీగా ఐదేళ్ల క్రితం ఎన్నికయ్యారు కానీ నేతన్నలకు ప్రతిసారి నిరాశే ఎదురైందన్నారు. పదేళ్లుగా సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్‌లూమ్ క్టస్టర్‌ను తీసుకొచ్చేందుకు తాను ఎ న్ని ప్రయత్నాలు చేసిన కేంద్రం నుంచి స్పం దన రాలేదన్నారు. పదిమంది కేంద్రమంత్రులను కలిసినా ఫలితం దక్కలేదన్నారు. సిరి సిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు మీకిదే సరై న సమయమనే సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఉ పాధి దొరక్క కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం నేతలన్న కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ పాతరేయడంతో చేనేత రంగం మరోసారి పదేళ్ల తరువాత సంక్షోభంలో కొట్టుమిట్లాడుతోందన్నారు. సిరిసిల్ల నేతలన్నను ఆదు కోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సార్లు కోరినా పట్టించుకోలేదని, కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులను కీలక సమయంలో ఆదుకునే అవకాశం ఇప్పుడు కేంద్రంలో చేతుల్లో ఉందన్నారు. మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి  నేతలన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని, చేతినిం డా పని దొరికి మళ్లీ ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందన్నారు.

ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని, చేనేతలను ఆదుకోవ డానికి పదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం బాధకరమన్నారు. వనరులు లేని రాష్ట్రాలకు సైతం కేంద్రం అనేక రకాల ప్రాజెక్టులను మళ్లిస్తుందని, అన్ని సానుకూలంగా ఉన్న సిరిసిల్లకు మేలు జరిగే దిశగా బండి సంజయ్ చొరవ చూపాలని కోరారు. బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రిని కలిసి పవర్‌లూమ్ క్లస్టర్ ప్రాధాన్యం, జరిగే లబ్ధిని వారి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. 

* సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తెప్పించాలి. కేంద్రమంత్రిగా మీకు వచ్చిన అవకాశం వినియోగించుకోవాలి. సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు మీకిదే సరైన సమయం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. ఉపాధి దొరక్క కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

 నేత కేటీఆర్

నేతన్నలకు మీరేం చేశారు?

  1. సిరిసిల్లలో 15 ఏళ్లుగా ఉంటున్నారు
  2. మీ హయాం నుంచి ఆకలి చావులు 
  3. కేటీఆర్ లేఖకు బండి సంజయ్ కౌంటర్

హైదరాబాద్, జూలై 11(విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ రాసిన లేఖపై గురువారం కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ లేఖకు ప్రకటన ద్వారా కౌంటర్ ఇచ్చారు. సామాజిక మాధ్యమంలో కేటీఆర్ రాసిన లేఖలోని అంశాలను తెలుసుకున్నానని సంజయ్ వెల్లడించారు. ఇన్నాళ్లకైనా కేటీఆర్ సిరిసిల్ల నేతన్నల సమస్యలను గుర్తించినందుకు సంతోషమన్నారు. రాష్ర్టంలో పదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు. మీరే డిఫ్యాక్టో సీఎం. 15 ఏళ్లుగా సిరిసిల్లకు మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పటి నుంచి నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి. నాటి నుంచి నేతన్నలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు.

మరి ఆ నేతన్నల కోసం మీరేం చేశారు? బండి సంజయ్ అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి బకాయిలు కూడా చెల్లించకుండా పవర్‌లూమ్ సంస్థలను మూతపడేలా చేసింది మీరు కాదా? అడిగారు. యార్న్ కొనుగోలు పేరుతో దోపిడీకి తెరలేపింది బీఆర్‌ఎస్ అని, కరెంట్ సబ్సిడీలను బంద్ చేసి పవర్ లూమ్ సంస్థల ఉసురు తీసింది గత ప్రభుత్వం కాదా అని నిలదీశారు. రాష్ర్టంలోని చేనేత కార్మికుల కోసం ప్రధాని మోదీ వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌ను బీఆర్‌ఎస్ హయాంలోనే ఏర్పాటు చేశారన్న విషయాన్ని మర్చిపోయారా? అని సంజయ్ దుయ్యబడ్డారు. ఆనాడు బీఆర్‌ఎస్ సర్కారు సహకరించి ఉంటే సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ పార్క్ ఎప్పుడో ఏర్పాటయ్యేదన్నారు. 

ఇన్నాళ్లకైనా కేటీఆర్ సిరిసిల్ల నేతన్నల సమస్యలను గుర్తించినందుకు సంతోషం. రాష్ర్టంలో పదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు. మీరే డిఫ్యాక్టో సీఎం. 15 ఏళ్లుగా సిరిసిల్లకు మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పటి నుంచి నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి.  మరి ఆ నేతన్నల కోసం మీరేం చేశారు?.

 కేంద్రమంత్రి బండి సంజయ్