హైదరాబాద్: ఏసీబీ(Anti Corruption Bureau) విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ నేతలతో కల్వకుంట్ల తారక రామారావు(K. T. Rama Rao) మాట్లాడారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సమస్యల గురించి దృష్టి మళ్లించేందుకే తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఏం జరిగినా శాంతియుతంగానే నిరసనలు తెలపండని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ప్రజల సమస్యలు, కాంగ్రెస్(Congress) హామీల అమలుపైనే దృష్టి పెట్టండని తెలిపారు. హామీల అమలు కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.
అటు ఏసీబీ ఎదుట కేటీఆర్ విచారణ జరుగుతోంది. కేటీఆర్ ను దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్(DSP Majeed Khan) విచారిస్తున్నారు. కేటీఆర్ విచారణను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ విచారణను వేరే గది నుంచి చేసేందుకు న్యాయవాదికి ఏర్పాట్లు చేశారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఫార్ములా-ఈ రేసు కేసు(Formula E race case)లో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. రేసు నిర్వహణలో అర్వింద్ కుమార్ కు ఇచ్చిన ఆదేశాలపై అధికారులు విచారిస్తున్నారు.