21-03-2025 02:04:24 AM
సూర్యాపేట, మార్చి 20: రాష్ట్ర ప్రజలు తిరస్కరించడంతో అధికారాన్ని కోల్పోపోవడంతో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దుయ్యబట్టారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశానికి సూర్యాపేటకు వచ్చి కాంగ్రెస్ నాయకులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని, ఖబర్దార్ కేటీఆర్ నోరు అదుపులోకి పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మాకు మీ కంటే ఎక్కువగా మాట్లాడటం వచ్చని, ప్రజాస్వామ్యంలో హుందా తనంగా వ్యవహరించాలని హితవు పలికారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, చివ్వేంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, అంజద్ అలీ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు రుద్రంగి రవి, నాగుల వాసులు పాల్గొన్నారు.