calender_icon.png 17 April, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

16-04-2025 02:28:30 PM

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భములపై సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పిన సుప్రీంకోర్టుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.

కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli Land Row)లో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీం కోర్టు(Supreme Court of India) ఇచ్చిన ఆదేశాలను అందరూ స్వాగతించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయం అన్నారు. వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం ఇదన్న కేటీఆర్ సుప్రీం కోర్టు ఉత్తర్వులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతం అన్నారు.  గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడి, హైదరాబాద్ భవిష్యత్తు కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ స్వాగతిస్తున్నదన్నారు. కంచ గచ్చిబౌలిని ప్రైవేట్ పార్టీకి తాకట్టు పెట్టిన రేవంత్ ప్రభుత్వ వ్యవహారంలో ఆర్థిక అవకతవకలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన కేంద్ర సాధికారిక కమిటీ మా పార్టీ వాదనను బలపరుస్తున్నదని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో పదివేల కోట్ల రూపాయల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని చేసిన ఆరోపణలను కేటీఆర్ పునరుద్ఘాటించారు. అడవుల పట్ల, వన్యప్రాణుల పట్ల రేవంత్ రెడ్డి నెంబర్ వన్ విలన్‌గా మారాడని ఆయన విమర్శించారు. పర్యావరణ విధ్వంసానికి, పర్యావరణ హత్యకు పాల్పడి తప్పించుకోలేరనే కనీస సోయి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తనను తాను మోసం చేసుకున్న విషయాన్ని అర్థం చేసుకుని, పర్యావరణ విధ్వంసం ఆపాలని కేటీఆర్ కోరారు.

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని(Telangana Govt) మందలించింది. అక్రమంగా చెట్ల నరికివేతకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణకు తీసుకుంటున్న చర్యలతో పాటు, ఒక కాంక్రీట్ పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ ఉల్లంఘనలపై నమోదైన సుమోటో కేసును జస్టిస్ బి.ఆర్. గవాయ్, ఎ.జి. మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయాన్ని మే 15కి వాయిదా వేస్తూ, సిఇసి నివేదికపై స్పందించడానికి తెలంగాణకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.  జంతువులను రక్షించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని రాష్ట్ర వన్యప్రాణి వార్డెన్‌ను ఆదేశించింది.