సంగారెడ్డి (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంది సెంట్రల్ జైల్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి సెంట్రల్ జైలుకి రాగానే కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. కేటీఆర్ వస్తుండటంతో జైలు ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు ఈ జైలు పరిధిలోకి ఎవరిని అనుమతించడం లేదు. కేటీఆర్ ముందుగా స్థానికంగా ఉన్న నేతలు, కార్యకర్తలను కలవడానికి కేటీఆర్ వాహనాన్ని మాత్రమే అనుమతించారు.
అనంతరం కంది జైలు లోపలికి పోలీస్ బలగాలతో వెళ్లారు. వారిని పరామర్శించి, బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ వారికి భరోసా కల్పించారు. రైతన్నలను జైలులో ములాఖాత్ కోసం వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ నేతల బృందంలో ఉన్న వారు కల్వకుంట్ల తారకరామారావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, చింత ప్రభాకర్, ఎమ్మెల్యే, అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే దేవరకొండ జాన్సన్ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు, ఖానాపూర్ నియోజకవర్గం ఉన్నారు.