calender_icon.png 15 November, 2024 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ.. చిత్ర హింసలు పెట్టారు

15-11-2024 04:07:33 PM

సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): సంగారెడ్డి జైలులో అక్రమంగా నిర్బంధించిన లగచర్ల గ్రామ రైతులను బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్, పార్టీ సినీయర్ నాయకులతో కలిసి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనలో  70 మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేస్తే, తిరుపతి రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21 మందిని మాత్రమే ఉంచి కాంగ్రెస్ వాళ్ళని పంపించేశారని ఆరోపించారు.

దుద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ అనుచరులు రమేష్, నర్సింహులు, రాములు నాయక్ కూడా దాడిలో పాల్గొన్నారు. కానీ తిరుపతి రెడ్డి ఫోన్ చేయగానే వాళ్లను వదిలేశారని,  ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లే చేపించినట్లు కట్టుకథ అలరాని తెలపారు. ఇది రాజకీయ దాడిగా చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని, దాడి జరిగినప్పుడు ఊరిలో లేని వాళ్లని కూడా ఎందుకని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కులగణన కోసం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి అక్కడ లేకపోయినా కూడా అతని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. వనపర్తిలో ఐటీఐ చదువుతున్న గిరిజన విద్యార్థి గొడవ జరిగింది కదా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని చూసి పోదామని వస్తే అతన్ని కూడా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

కొడంగల్ సీఐ, ఎస్ఐ, వికారాబాద్ ఎస్పీ వీళ్ళంతా కలిసి లగచర్ల రైతులపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలు పెట్టారన్నారు. కాళ్ళు, చేతులు కమిలిపోయి ఉన్నాయి మేజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదు అని అడిగితే.. చెప్తే మల్లి కొడతాం, మీ ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళని కూడా కొడతామని బెదిరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే  దేవరకొండ, జాన్సన్ నాయక్, మాజీ ఎమ్మెల్యే వివేకానంద్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ శంభుపురం రాజు, పార్టీ సీనియర్ నాయకులు, ఖానాపూర్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.