హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మహాధర్నా కొనసాగనుంది. బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ పాల్గొనున్నారు. కేటీఆర్ తో పాటు పలువురు నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొనున్నారు.