calender_icon.png 25 April, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ - తెలంగాణ జాతిపిత పాటను ఆవిష్కరించిన కేటీఆర్

25-04-2025 03:00:16 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 27వ తేదీన వరంగల్ వేదికగా  బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగనుంది. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా కేసీఆర్ - తెలంగాణ జాతిపిత పాటను బంజారాహిల్స్ నందినగర్ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవాన్ని, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవిశ్రాంత ప్రయాణాన్ని ఈనెల 27న వరంగల్ లో జరుగుపుకుంటున్నారు.

కేసీఆర్ అసమాన నాయకత్వం ప్రత్యేక తెలంగాణ కలను చారిత్రాత్మక వాస్తవంగా మార్చింది. సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలుపుతూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన కేసీఆర్ - తెలంగాణ జాతిపిత పాటను తమ నాయకుడు కేసీఆర్ కు అంకితం చేస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దయాకర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, కల్లెట్లపల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.