మంత్రి సీతక్క ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): అంగన్‌వాడీల్లో కుళ్లిన గుడ్డు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టుచేయడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తంచేశా రు. కేటీఆర్ పోస్టుపై ఆమె స్పందిస్తూ భువనగిరిలోని ముదిరాజ్ వాడ అంగన్‌వాడీ కేంద్రంలో 22వ తేదీన పాడైపోయిన గుడ్డు సరాఫరా అయ్యిందన్న వార్త తెలిసిన వెంటనే సంబంధిత శాఖ జిల్లా అధికారి విచారణ చేపట్టినట్లు తెలిపారు. సెక్టార్ సూపర్‌వైజర్, టీచర్, హెల్పర్‌తోపాటు కోడిగుడ్ల కాంట్రాక్టర్‌కు మెమో జారీ చేసినట్టు స్పష్టం చేశారు. 23 తేదీన వారు లిఖిత పూర్వక వివరణ కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు.
అయితే వారి వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో బాధ్యులను సస్పెండ్ చేసేందుకు అవసరమైన ప్రక్రియను 24 గంటల్లోపే జిల్లా అధికారులు ప్రారంభించినట్టు వెల్లడిం చారు. అవేవి పట్టకుండా నాలుగు రోజులు ఆలస్యంగా కేటీఆర్ ట్వీట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల్లో పాడైపోయిన గుడ్లకు సంబం ధించి ఎన్నో ఘటనలు వెలుగు చూసి నా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. పొరపాటు జరిగితే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.