calender_icon.png 21 February, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాన్ని క్యాసినో హబ్‌గా మార్చిన కేటీఆర్

14-02-2025 12:11:57 AM

పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాసినో హబ్‌గా మార్చారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో, జూదాలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరుగుతు న్నాయని అన్నారు.

గురువారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడు తూ.. కేటీఆర్ బావమరిది ఇంట్లో పార్టీలో కొకైన్ పట్టుబడితే.. ఆ మా త్రం తీసుకోవద్దా? అన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న అక్రమాలకు కేటీఆరే బాధ్యుడని, ఆ కేసుకు కేటీఆర్ కూడా శిక్షార్హుడేనని విమర్శించారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నానని చెప్పారు. పదవుల విషయంలో ప్రభుత్వం, పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.