calender_icon.png 7 January, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్

06-01-2025 10:50:18 AM

హైదరాబాద్: ఏసీబీ ప్రధాన కార్యాలయం(Anti Corruption Bureau) వద్ద మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులు కేటీఆర్ వెంట వెళ్లకూడదని పోలీసులు వాహనాన్ని నిలిపివేశారు. న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. ఏసీబీ ఆఫీస్ బైట కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ... ఇవాళ ఏసీబీ ఆఫీసుకు రమ్మన్నారు.. నన్ను అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉందని కేటీఆర్ తెలిపారు. గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నేను నిర్ణయం తీసుకున్నా. నా వద్ద సమాచారం ఉందని అపోహ పడుతున్నారు. అపోహ పడుతున్న సమాచారమంతా ప్రభుత్వం దగ్గర ఉంది. నా వాదన ఇప్పటికే కోర్టులో చెప్పా. కోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.

హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఏసీబీ ఆఫీసుకు వచ్చా. నా లాయర్ ను నాతో రావద్దని చెబుతున్నారు. ఏసీబీ విచారణకు అడ్వకేట్(Advocate) ను పోలీసులు అనుమతించలేదు. నాకు న్యాయవాదిని తీసుకొచ్చే హక్కు ఉంది. నా లాయర్ ను నాతో రావద్దని  చెబుతున్నారు. నా లాయర్ ను వెంటపెట్టుకుని విచారణకు వచ్చే అధికారం ఉందని అనుకుంటున్నా. భారత రాజ్యాంగం(Constitution of India) నడుస్తుందని అనుకుంటున్నా. కాదు రేవంత్ రాజ్యాంగమే నడుస్తుందని వాళ్లంటున్నారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేశాక నన్ను పిలవాల్సిన అవసరం లేదని సూచించారు. నేను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నా.. ఇంతమంది పోలీసులెందుకు? అని ప్రశ్నించారు. న్యాయవాదిని అనుమతించమని ఏసీబీ(ACB) వాళ్లు చెప్పాలి. మీరెందుకు చెబుతున్నారని కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు.