calender_icon.png 15 November, 2024 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇవాళ కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది: కేటీఆర్

15-11-2024 02:07:45 PM

రేవంత్ రెడ్డీ.. అధికారంలోకి వచ్చాక నిన్నేంచేయాలో మాకు తెలుసు

హైదరాబాద్: కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రాబందులా మారారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలను విమర్శించారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలకు వేలఎకరాలు కావాలంటున్నారని ప్రశ్నించారు. కులగణనలో పాల్గొన్న వ్యక్తిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు. వేరేచోట ఐటీఐ చదువుకుంటున్న విద్యార్థిని కూడా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారని కేటీఆర్ సూచించారు. సీఎం అన్న తిరుపతిరెడ్డి రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తిరుపతిరెడ్డి ఫోన్ లో ఆదేశాలిస్తున్నారు.. అధికారులు పాటిస్తున్నారని విమర్శించారు. దాడులు చేస్తూ వీడియోల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేశారని, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి మండిపడ్డారు. కావాలనే సీఎం ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమారు.. తన పదవి ఐదేళ్లే అని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. కొడంగల్ ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలన్నదే రేవంత్ ప్రయత్నం అన్నారు. ఇవాళ కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డీ.. అధికారంలోకి వచ్చాక నిన్నేంచేయాలో మాకు తెలుసన్నారు. కేసులెన్ని పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దని కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఎకరం రూ. 60 లక్షల భూమిని రూ. 10 లక్షలకు గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదవాడి కన్నీళ్ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రేవంత్ రెడ్డికి  చేతనమైతే తమతో కొట్లాడాలి.. అమాయకులతో కాదని సూచించారు.