calender_icon.png 14 November, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఫార్ములా’ నుంచి బయటపడేందుకే ఢిల్లీకి కేటీఆర్

12-11-2024 12:20:26 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఢిల్లీలో ఏంపని అని, అసలు అయనను ఢిల్లీకి పిలిచిందేవరు అని? అమృత్ టెండ ర్లపైన ఫిర్యాదు చేయడానికి ఏముందని? ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డినే ఎలాంటి అవినీతి లేదని తెల్చి చెప్పారని గుర్తుచేశారు.

అమృత్ పేరుతో ఢిల్లీలో బీజేపీ నేతల కాళ్లు మొక్కడానికి కేటీఆర్ వెళ్లారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపిం చారు. ఫార్ములా ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్ అని ఆరోపించారు. రూ.8,888 కోట్ల కుంభకోణమని నోటికొచ్చినట్టు వాగి లీగల్ నోటీసులు ఇప్పించుకున్నారని దుయ్య బట్టారు. అసలు టెండరే రూ.3,500 కోట్లని తెలిపారు. కేంద్రానికి ఫిర్యా దు చేసే ముందు..

వారి పార్టీకి చెం దిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి సమాధానం చెప్పాలని హితవుపలికారు. ఫార్ములా ఈ కేసు లో ఎఫ్‌ఐఆర్‌కు అనుమతి ఇస్తారన్న భయం కేటీఆర్‌కు పట్టుకుందన్నారు. అడ్డగోలుగా ఇచ్చిన నిధులకు కేటీఆర్ లెక్క చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ పై చ ట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లుతోందన్నారు. కేటీఆర్ ఎమ్మెల్యే గా ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని ఎద్దేవా చేశారు.