calender_icon.png 9 January, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్

09-01-2025 09:59:31 AM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కాసేపట్లో ఏసీబీ ఎదుట హాజరుకానున్నారు. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏసీబీ కేటీఆర్ ను ప్రశ్నించనుంది. రేసు నిర్వహణకు అర్వింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై విచారించనుంది. అర్వింద్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్, రికార్డు  చేసిన అంశాల ఆధారంగా దర్యాప్తు చేయనున్నారు. ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశముంది.

విదేశీ సంస్థలకు నగదు చెల్లింపుల్లో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశముంది. కేటీఆర్(KTR) విచారణ దృష్ట్యా అధికారులు, పోలీసులు అప్రమత్తమ య్యారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హై కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసందే. కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది రామచంద్రరావు(Advocate Ramachandra Rao) వెళ్లనున్నారు. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ గురువారం నాడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ నేతలు తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao), కల్వకుంట్ల కవిత ఇప్పటికే కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. భర్త అనిల్ తో కలిసి కవిత కేటీఆర్ ఇంటికి వెళ్లారు. న్యాయవాది రామచంద్రరావు కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు,.