హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్(BRS Working President KTR) లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ ప్రారంభమయింది. కేటీఆర్ వెంట వెళ్లే లాయర్ పేరును ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేటీఆర్ వెంట రామచంద్రరావు(Ramachandra Rao) వెళ్తారని కేటీఆర్ న్యాయవాది పేర్కొన్నారు. అలాగే కేటీఆర్ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయలని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు సూచించారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. న్యాయవాది కేటీఆర్ కనిపించే దూరంలో ఉంటారని, లైబ్రరీలో కూర్చుంటే విచారణ కనిపిస్తుందని ఏఏజీ తెలిపారు. న్యాయవాదితో కలిసి గురువారం ఏసీబీ విచారణకు వెళ్లాలని కేటీఆర్ కు హైకోర్టు సూచించింది. రేపటి విచారణ తర్వత అనుమానాలుంటే మళ్లీ సంప్రదించాలని హైకోర్టు పేర్కొంది.