హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KT Ramarao) ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Nara Chandrababu Naidu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)లను ప్రస్తావిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. అయితే ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నియాంశంగా మారింది. గత దశాబ్ద కాలంగా భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్ని కేటీఆర్(KTR) తెలిపారు.
ఈ విజయానికి ప్రగతిశీల పాలన విధానాలే కారణమని చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాలలో తెలంగాణ విజయాన్ని గుర్తించారని, తన అభిప్రాయాన్ని బలోపేతం చేయడానికి ఎపీ సీఎం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశంసించిన వీడియోను జత చేసి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నసీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయంపై కొంత అవగాహన పొందడానికి దయచేసి సహాయం చేయండని కేటీఆర్ ఎక్స్ లో పరోక్షంగా ప్రస్తావిస్తూ రాశారు.