సంగారెడ్డి (విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ సంగారెడ్డికి బయలుదేరరు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి 12 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. జైలులో ఉన్న లఘుచర్ల గ్రామ రైతులను కేటీఆర్ బృందం పరామర్శించనుంది. ప్రస్తుతం కంది సెంట్రల్ జైల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ ములాఖాత్ కు 5 మందికి మాత్రమే ప్రవేశం కలదు అని తెలుస్తుంది.