సిరిసిల్ల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలోనూ రుణమాఫీ అందరికీ అందలేదని, రూ. 2 లక్షల రుణమాఫీ సరిగా అమలు చేయట్లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల( Sirisilla BRS leaders and activists)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రైతులు ప్రమానపత్రం రాసి అధికారులకు ఇవ్వాలని ప్రభుత్వం అంటోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 75 లక్షల మంది రైతులకు డబ్బులు పడ్డాయని కేటీఆర్(KTR) పేర్కొన్నారు.