calender_icon.png 11 January, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి.. బీఆర్ఎస్ పూర్తి మద్దతు

30-12-2024 12:25:15 PM

హైదరాబాద్: శాసనసభలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌(Manmohan Singh) సంతాప తీర్మానం సంధర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రసంగించారు. మాజీ ప్రధాని, దివంగత డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ పై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ, మన్మోహన్‌ సింగ్‌ కి భారతరత్నకి ఇవ్వాలనే ప్రతిపాదనకి కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామరథ్యం, జ్ఞానాన్ని ముందు గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని కేటీఆర్ అన్నారు. మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి కూడా ఢిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ శాసనసభ ద్వారా తీర్మానం పెడితే మన గౌరవం, మన శాసనసభ గౌరవం పెరుగుతుందన్నారు.

కేసీఆర్ స్వర్గీయ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాఖల కేటాయింపుల్లో వచ్చిన చిక్కుముడిని కేసీఆర్ తన షిప్పింగ్ పోర్ట్‌ఫోలియోను డీఎంకే పార్టీకి వదులుకొని తీర్చారన్నారు. స్వయంగా మన్మోహన్ దగ్గరికి వెళ్లి కేసీఆర్ తనకు శాఖలు ముఖ్యం కాదు, తెలంగాణ ఏర్పాటు ముఖ్యమంటూ స్వయంగా షిప్పింగ్ శాఖ డీఎంకేకు ఇవ్వాలని కోరినప్పుడు, ఈరోజు తెలంగాణ(Telangana) కోసం ఇచ్చిన ఈ పోర్ట్‌ఫోలియో.. తెలంగాణ కోసం మిమ్మల్ని ఒక కర్మయోగిగా మారుస్తుందని ఆరోజు మన్మోహన్ సింగ్ కేసీఆర్(KCR) గురించి మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తుచేశారు. డిసెంబర్ 18, 2004లో ఓబీసీ(OBC)ల సమస్యల పైన కేసీఆర్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ని కేవలం ఐదు నిమిషాలు కాదు మరింత సమయం ఇవ్వాలని కొరితే, 45 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చి సమస్య తీవ్రత తెలుసుకుని దాదాపు గంటన్నర పాటు గడిపి అన్ని అంశాలను తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్న ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారని కొనియాడారు. మౌన ముని అన్నా పట్టించుకోలేదు.. పనిచేసుకుంటూనే వెళ్లారన్నారు. ఒక గొప్ప ఆలోచనకు, గొప్ప ఆశయానికి సమయం వచ్చినప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదు.. అది మన్మోహన్ సింగ్ నమ్మారు కాబట్టే ఆయన నాయకత్వంలోనే తెలంగాణ ఏర్పాటైందని కేటీఆర్(KTR) స్పష్టం చేశారు.