ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటాను
హైదరాబాద్: కేసీఆర్ మా ట్రంప్ కార్డు, ప్రజల్లోకి ఎప్పుడు రావలో ఆయనకు తెలుసని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ పెట్టిన ఫార్ములా- ఈ కేసు.. అవినీతి లేని మొదటి కేసన్నారు. ఏడాదిగా ప్రయత్నంచి తనపై కేసు పెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఫార్ములా-ఈ రేసుకు అప్పుడు మంత్రిగా తాను అనుమతిస్తే.. ఇప్పుడు రద్దు చేశారని తెలిపారు. తాను తప్పు చేస్తే రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది ఎలా ఒప్పు అవుతుంది? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీం కోర్టుకు వెళ్తానన్న కేటీఆర్ ఈ సంవత్సరం ఉప ఎన్నికలు రావచ్చనని జోస్యం చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్నారు.
స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. రైతుభరోసాతో రైతుల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని చెప్పారు. ఆర్ఆర్ఆర్(Regional Ring Road) విషయంలో రూ. 12 వేల కోట్లు నష్టం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఖాజాగూడ భూములపై కన్నేసి పేదలను రోడ్డు పాలు చేశారని ద్వజమెత్తారు. రూ.1.38 లక్షల కోట్లు అప్పు చేసి ఢిల్లీకి వేల కోట్లు పంపుతున్నారని ఆరోపించారు. దిల్ రాజువి 2 సినిమాలున్నాయి.. ఆయన బాధ ఆయనదే అన్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో పార్టీ బహిరంగసభ ఉంటుందన్న కేటీఆర్(KTR) వేసవి కాలం నుంచి పార్టీ సభ్యుత్వ నమోదు ఉంటుందన్నారు. అక్టోబర్ లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్(KCR) ను పార్టీ అధ్యక్షునిగా మొదట తానే ప్రతిపాదిస్తానని కేటీఆర్ వెల్లడించారు.