calender_icon.png 27 October, 2024 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ పునరుజ్జీవనం ఎవరి కోసం..?: కేటీఆర్

27-10-2024 11:54:01 AM

మూసీ పునరుజ్జీవనానికి మాత్రమే పైసలున్నాయా?

హైదరాబాద్: నాచారంలోని ఎస్టీపీని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరిశీలించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నాచారంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మురికి నీటి శుద్ధికి సుమారు రూ. 4 వేల కోట్లు కేటాయించామన్నారు. బీఆర్ఎస్ కట్టిన ఎస్టీపీల వల్ల మురికి నీరు శుద్ధి జరుగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీలనే రేవంత్ రెడ్డి ప్రారంభించారని కేటీఆర్ ఆరోపించారు.

కేసీఆర్ ఎప్పుడో మూసీ పునరుజ్జీవనం పనులు మొదలు పెట్టారని చెప్పారు. ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా చేయాల్సింది ఏమీ లేదని కేటీఆర్ సూచించారు. రుణమాఫీకి, రైతుబంధుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవని చెప్పారు. ఏ పథకం అమలు చేయాలన్నా పైసలు లేవని మంత్రులు అంటున్నారు.. మరి మూసీ పునరుజ్జీవనానికి మాత్రమే ప్రభుత్వం వద్ద పైసలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవనానికి రూ. లక్షన్నర ఖర్చు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ పునరుజ్జీవనం  ఎవరి కోసం చేస్తున్నారు.. స్థిరాస్తి వ్యాపారానికి కాదా..?