హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలేంటో కేటీఆర్ చెప్పాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా..?, ప్రజలకు మంచి చేయడమే ప్రభుత్వ వైఫల్యమా..? అని ప్రశ్నించారు. అధికారం పోయినప్పుడల్లా బీఆర్ఎస్ ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఫార్మాక్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పనని మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చడంపై నే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని ధ్వజమెత్తారు. కులగణన విప్లవాత్మక నిర్ణయమన్న భట్టివిక్రమార్క పథకాలు పెంచడానికే కులగణన చేస్తున్నామని వెల్లడించారు. కులగణన చేస్తామని మాట ఇచ్చాం.. చేస్తున్నామని వివరించారు. రాష్ట్రాభివృద్ధికి కులగణన ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు తయారు చేశామని చెప్పారు.