calender_icon.png 9 January, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ అధికారులకు కేటీఆర్ సహకరించాలి..

09-01-2025 12:14:31 AM

తన నిజాయితీని నిరూపించుకోవాలి..

ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ...

ముషీరాబాద్ (విజయక్రాంతి): ఏసీబీ, ఈడీ అధికారులకు కేటీఆర్ సహకరించి తన నిజాయితీని నిరూపించుకోవాలని జాతీయ ఓబీసీ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ ఆళ్ల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆదర్శనగర్‌లోని జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఫార్ములా రేసులో ప్రజా ధనం పణంగా పెట్టి కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో దేశంలో అత్యధికంగా వసూలుకు పాల్పడిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అతి బీఆర్‌ఎస్ పార్టీయేనని అన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి అహంకారంగా మాట్లాడిన కేటీఆర్ ఇప్పటికైనా నిజం ఒప్పుకోవాలన్నారు. అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్ల, ఫండు రూపంలో వసూలు చేసిన పార్టీ దేశంలో ధనిక ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్ అని ఆరోపించారు. రూ. 55 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి వస్తే దానిపై ఈడీ విచారణకు పిలిచిందన్నారు. నాడు తొడగొట్టి సవాలు చేసిన కేటీఆర్, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారన్నారు. విచారణ తప్పించుకునేందుకు దొంగసాకులు వెతుక్కుంటున్నారని అన్నారు. ఏముంది లొట్టపీసు అంటూ ప్రగల్బాలు పలిగిన కేటీఆర్ ఏసీబీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.