calender_icon.png 28 November, 2024 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారం రోజుల్లో కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

30-10-2024 01:51:06 AM

  1. లేదంటే కేటీఆర్‌కు నోటీసులిస్తా..
  2. ఆయన ఆరోపణలన్నీ అవాస్తవం
  3. లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రిప్లు 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): కేటీఆర్ తన లీగల్ నోటీసులను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చె ప్పాలని, లేకుంటే వారం రోజుల్లో  లీగల్ నో టీసులు పంపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు.

లీగల్ నోటీసులో కేటీఆర్  పేర్కొన్న ఆరోపణలన్నీ అవాస్తవమని తెలిపారు. మంగళవారం కేటీఆర్ లీగల్ నోటీసు లకు బండి సమాధానం ఇచ్చారు. సంజయ్ తరఫున ఆయన న్యాయవాది.. కేటీఆర్ తర ఫు లాయర్‌తో పాటు కేటీఆర్‌కు ఈ నోటీసులను పంపించారు. కేటీఆర్ పేరును మీడి యా సమావేశంలో తాను ఎక్కడా ప్రస్తావించలేదని నోటీసులో సమాధామిచ్చారు.

ఫో న్ ట్యాపింగ్ జరిగినట్లు కేటీఆర్ గతంలో అం గీకరించారని తెలిపారు. కేటీఆర్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించారు. తన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవి, నిరాధారమైనవి  కావని, ఎవరి ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదన్నారు. కేటీఆర్‌ను గాని, ఆయన కు సంబంధించిన ఏ వ్యక్తిని గాని లక్ష్యంగా చేసుకుని తన పదవిని ఏ సమయంలోనూ దుర్వినియోగం చేయలేదన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై మాత్రమే మాట్లాడినట్లు  పే ర్కొన్నారు. తనకు కేటీఆర్‌ను ఉద్దేశపూర్వకం గా విమర్శించే ఆలోచన లేదన్నారు. కాగా సంజయ్ మాట్లాడిన మాటలు తన పరువుకు నష్టం కలిగించాయని కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారనిఆరోపిస్తూ వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసు లు పంపించిన సంగతి తెలిసిందే. 

రాష్ట్రంలో హెచ్‌ఆర్‌కె సర్కారు.. 

తెలంగాణలో హెచ్‌ఆర్‌కె (హరీశ్‌రావు, రేవంత్ రెడ్డి, కేటీఆర్) సర్కారు నడుస్తోందని కేంద్ర మంత్రి సంజయ్‌ఆరోపించారు. రేవం త్ రెడ్డి సర్కారుకు హరీశ్, కేటీఆర్ పోటీపడి మరీ సహకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలోని విశాఖపట్నంలోఎమ్మెల్యే విష్ణువర్దన్ రాజు నివాసం వద్ద మీడియాతో మాట్లాడా రు. కేటీఆర్ బావమరది ఫాంహౌస్ ఘటనను నీరుగార్చారని ఆరోపించారు. 

కేటీఆర్ నోటీసులపైనా స్పందిస్తూ త్వరలో తానూ కేటీఆర్‌కు నోటీసులిస్తానని చెప్పారు. రాష్ట్రం లో గ్యారంటీలను అమలు చేసేదాకా కాంగ్రె స్ సర్కారును వెంటాడతామన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను  నామరూపాల్లేకుండా భూస్థాపితం చేస్తామని తెలిపారు.  కేటీఆర్, హరీశ్ పంచాయతీ నడుస్తోందని అన్నారు.