07-02-2025 01:45:14 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): అబద్దపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠమెక్కి, రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 420 మంది రైతుల బలవన్మరణంతో తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకుందని, రుణమాఫీని ఆగం చేసి రైతుల పంటల పెట్టుబడి సాయానికి పాతరేశారని మండిపడ్డారు. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చి రైతుల ఆత్మహత్యలు ఆపాలని కేఆర్ హెచ్చరించారు.