calender_icon.png 12 February, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన పూర్తిగా తప్పుల తడక : కేటీఆర్

09-02-2025 06:04:55 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో ఐదున్నర శాతం జనాభాను తగ్గించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ ముఖ్య నేతల సమీక్ష సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన కుల గణన సర్వే అంతా తప్పుల తడకగా ఉందని, కావాలనే బీసీల సంఖ్యను ఐదున్నర శాతం తగ్గించారని ఆరోపించారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయాన్ని చేస్తోందన్నారు. దాదాపు 22 లక్షల మంది ఉన్న బీసీలను లేనట్లు చిత్రీకరించారని, జనాభా తగ్గించడంపై బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కులగణన చిత్తు కాగితంతో సమానమని కాంగ్రెస్ ఎమ్మెల్యే తగులబెట్టారన్నారు. రీసర్వే చేసి సరైన లక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. రీసర్వే విషయంలో మేము కూడా చొరవ తీసుకుంటామని చెప్పారు. కులగణనలో కేటీఆర్, కేసీఆర్ పాల్గొన్నలేదని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే పాల్గొన్నాలని తొలుత చెప్పారని ఆయన చెప్పారు. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని,  42 శాతమని బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా మాట నిలబెట్టుకోవాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెడితే చట్టబద్ధత కల్పిస్తామని కేటిఆర్ వెల్లడించారు.  గతంలో బీసీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇచ్చి అసెంబ్లీ, ఎంపీ, స్థానిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించామని గుర్తు చేశారు.