calender_icon.png 16 October, 2024 | 4:00 PM

రేవంత్ రెడ్డి బుల్డోజర్లకు.. అడ్డంగా నిలబడతాం

16-10-2024 01:02:01 PM

మూసీ నదిపై రోజుకోమాట

హైదరాబాద్ బస్తీ ప్రజలకు మేం అండగా ఉంటాం

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపే బుల్‌డోజర్లకు మేం అడ్డంగా నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని నాలాల విస్తరణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం మూసీ నది గురించి రోజుకోమాట చెబుతున్నారని మండిపడ్డారు. మూసీ నదిపై డీపీఆర్ పూర్తికాలేదని అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ నది విషయంలో అనాలోచితంగా ముందుకెళ్తున్నారని హెచ్చరించారు. 40 ఏళ్లుగా ఉంటున్న వారి ఇళ్లు కూలగొడతామని అంటున్నారు.. ఏదైనా పని చేయాలంటే దానికో విధానం, పద్ధతి ఉంటుందన్నారు. బిల్డర్లను బెదిరించేందుకు, వసూల్లు కోసమే హైడ్రా పేరుతో డ్రామా చెస్తున్నారని ఆరోపించారు.

మూసీ విషయంలో వందశాతం సువరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంటు నిర్మాచామన్న ఆయన మూసీ నది నీటి శద్ధీకరణ పనులు తామే పూర్తి చేశామన్నారు. మూసీ నది సుందరీకరణ కు రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ బస్తీ ప్రజలకు తాము అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. 40,50 ఏళ్ల క్రితం మీరు చేసిన తప్పులకు ఇప్పుడు పేదలను బాధ్యులను చేస్తారా? అని ప్రశ్నించారు. 40,50 ఏళ్లు క్రితం మీరు చేసిన తప్పులే ఇవన్నీ అన్నారు. గతంలో అనుమతులు ఇచ్చింది.. రిజిస్ట్రేషన్లు చేసింది మీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. 440 బాధిత కుటుంబాల తరుఫున తమ పార్టీ లీగల్ సెల్ పోరాటం చేస్తోందని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ ద్వంద్వ విధానాలు, తప్పులను ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. హైడ్రా పేరుతో వసూల్లు చేస్తున్నారని వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.