calender_icon.png 14 November, 2024 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నాపర్లలా వచ్చి అరెస్ట్ చేశారు.. ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

13-11-2024 01:17:34 PM

హైదరాబాద్: చైనాలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో గతంలో అధ్యయనం చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం పేర్కొన్నారు. పరిశ్రమలు ఒకేచోట ఉంటే సౌకర్యాల కల్పనకు వీలవుతుందని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ ఇక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ నిర్వహించి పరిశ్రమల విస్తరణ ప్రణాళికలపై అడిగారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే హైదరాబాద్ బల్క్ డ్రగ్ కేంద్రంగా ఉందని చెప్పారు.

బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు, కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారు. కిడ్నాపర్లలా వచ్చి తీసుకెళ్తే దాన్ని అరెస్ట్ అంటారా? అని ప్రశ్నించారు. నరేందర్ రెడ్డికి ప్రైవేటు సిబ్బందితో వైద్య పరీక్షలు చేయించాలి, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారిని చిత్రహింసలు పెట్టారని చెబుతున్నారు. కలెక్టర్ దాడి కాలేదన్నారు.. దాడి జరిగిందని ఐజీ చెబుతున్నారని కేటీఆర్ వెల్లడించారు.

తమ పార్టీ నేత సురేష్‌తో మాట్లాడితేనే నేరమైతే... పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా?.. అలాగైతే.. దేశాన్ని దోపిడీ చేస్తున్నాడని అదానీని రాహుల్ గాంధీ తిడుతున్నారు.. మరీ.. అదే అదానీతో రాసుకుపూసుకు తిరుగుతున్న రేవంత్‌ని సీఎం పోస్టు నుంచి తప్పించాలా? వద్దా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తనను నమ్మి గెలిపించిన కొడంగల్ రైతులను జైలుకు పంపి.. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోసే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తోందన్నారు.

సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతుల తిరుగుబాటుతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యామేజ్ కంట్రొల్ కోసం ఆ ఘటనను బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే కుట్రలో భాగమే పట్నం నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టు అని పార్టీ ఆరోపించింది. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులతో అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.